హైదరాబాద్: ఐపిఎల్‌లో ఆటగాళ్లు బాగా రాణిస్తేనే జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. వచ్చే ఐపిఎల్‌లో సదరు ఆటగాళ్లు ఫ్రాంచైజీలు దృష్టి పెడుతాయి. ఫామ్‌లో ఉంటే రాజభోగాలు దరి చేరుతాయి. లేకపోతే జట్టు యజమాన్యాలు ఆటగాళ్ల నుంచి దూరం వెళ్తాయి. ఆసీస్ యువ క్రికెటర్ జేక్ ఫ్రేజర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. గత ఐపిఎల్ సీజన్‌లో జేక్ ఫ్రేజర్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 234 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. దీంతో అతడిని వేలంలో తొమ్మిది కోట్లకు డిసి కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా పరంగా గత 24 ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసి ఫామ్‌ను కోల్పోయి ప్రస్తుతం అతడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు.
జేక్ ఫ్రేజర్‌పై ఆసీస్ మాజీ ఆటగాడు గిల్ క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జేక్‌పై ఢిల్లీ జట్టు నమ్మకం ఉంచిందని, నమ్మకం వమ్ము చేయకుండా నిలబెట్టుకోవాలని సూచించాడు. తొలి మ్యాచ్ నుంచి అతడు ప్రభావం చూపించాలన్నారు. ఐపిఎల్ గురించి తనకు తెలిసింది చెబుతున్నానని, ఫలితాలు అనుకున్న విధంగా రాకపోతే మాత్రం ఓనర్లు, కోచ్‌లు సదరు ఆటగాళ్లకు ఉద్వాసన పలుకుతారన్నారు. గత సీజన్‌లో జేక్ అద్భుతంగా ఆడారని, అదే ఆటను కొనసాగించాలని సూచనలు చేశాడు. అతడి దూకుడు ఉపఖండ ఫిచ్‌లు సహకరిస్తాయని అనుకుంటున్నానని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గిల్ క్రిస్ట్ తెలిపారు.