Monday, December 23, 2024

టీమిండియా దూకుడు.. పంత్, గిల్ అర్థ శతకాలు

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్-టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 86/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట ప్రారంబించిన భారత బ్యాట్స్ మెన్లు శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ లు దూకుడుగా ఆడుతున్నారు. తొలి సెషన్ లో ధనాధన్ బ్యాటింగ్ తో బౌండరీలు బాదుతున్నారు.

ఈ క్రమంలో ఇద్దరూ అర్థ శతకాలు పూర్తి చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం భారత్ 30 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గిల్(55), పంత్(50)లు క్రీజులో ఉన్నారు. కాగా, న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా 5 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో చెలరేగడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News