- Advertisement -
టీమిండియా యువ సంచలనం, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా గిల్ ఈ ఫీట్‌ను సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు సాధించిన బ్యాటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. గిల్ 50 ఇన్నింగ్స్‌లలోనే 2500 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో గతంలో సౌతాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఆమ్లా 59 ఇన్నింగ్స్‌లలో 2500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కానీ గిల్ ఈ ఘనత 50 ఇన్నింగ్స్‌లలోనే సాధించడం విశేషం.
- Advertisement -