ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ విజయాన్ని ఎంజాయ్ చేసే లోపే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు బిసిసిఐ షాక్ ఇచ్చింది.
ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపిఎల్ పాలక మండలి ప్రకటనలో తెలిపింది. ఐపిఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేటు కారణంగా గిల్‌కు ఈ జరిమానా పడింది. అయితే ఇది మొదటి తప్పిదం కాబట్టి కేవలం జరిమానాతో సరిపెట్టింది.
కాగా నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా.. జాస్ బట్లర్ వీర విహారంతో గుజరాత్ 19.2 ఓవర్లలో 204 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.