Saturday, November 16, 2024

ఆ బ్యాట్స్‌మెన్‌ను జట్టులో నుంచి తీసేయండి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ హోరంగా విఫలమయ్యాడు. గిల్ 66 బంతుల్లో 23 పరుగులు చేసి మైదానం వీడాడు. దక్షిణాప్రికా సిరీస్ ఘోరంగా విఫలమైనప్పటికి జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  దీంతో గిల్‌ను జట్టు నుంచి తొలగించాలని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదని మండిపడుతున్నారు. గిల్‌కు బదులుగా రజత్ పటీదార్‌ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. దేశవాలీ క్రికెట్ లో అద్భుతంగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ను జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదని క్రికెట్ పండితులు ప్రశ్నిస్తున్నారు.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొవడంలో గిల్ చాలా ఇబ్బంది పడ్డాడు. బ్యాట్ ఎలా పట్టాలో కూడా గిల్‌కు తెలియడం లేని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌లలో గిల్ (6), (10), (29), (2), (26), (36), (10), (23) పరుగులు చేయడంతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గిల్ బదులుగా జట్టులోకి మరో బ్యాట్స్‌మెన్ తీసుకుంటే బెటర్ అని సెలక్షన్ కమిటీకి నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు గిల్ 21 టెస్టులు ఆడి 1063 పరుగులు చేశారు. 21 టెస్టులలో రెండు సెంచరీలు మాత్రమే ఉన్నాయి. భారత్ జట్టు 78 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 314 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు టీమిండియా 70 పరుగుల ఆధిక్యంలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News