Wednesday, January 22, 2025

ఇండియా 200/1, గిల్ రిటైర్డ్ హర్ట్

- Advertisement -
- Advertisement -

న్యూజీలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా జోరు కొనసాగుతోంది. 28 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా ఒక్క వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులు చేసి అవుట్ కాగా, ఊపు మీద ఉన్న శుభ్ మన్ గిల్ (79 పరుగులు), తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. కోహ్లీ 56 పరుగులతోను, శ్రేయస్ 15 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News