Wednesday, January 22, 2025

‘జిన్నా’గా మంచు విష్ణు అదరగొట్టేశారు

- Advertisement -
- Advertisement -

Ginna Movie pre release in Hyderabad

విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జిన్నా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్. దీపావళి సందర్భంగా జిన్నా మూవీని ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డా. మంచు మోహన్ బాబు మాట్లాడుతూ “జిన్నా సినిమాకు మూల కథను అందించిన జి.నాగేశ్వర్ రెడ్డి, కోన వెంకట్, ఛోటా కె.నాయుడు ఎంతో గొప్పగా నా బిడ్డను ఈ సినిమాలో చూపించారు. అనూప్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మంచి ఔట్‌పుట్ కోసం కష్టపడిన దర్శకుడు సూర్యకు థాంక్స్. హీరోయిన్స్ సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ చక్కగా నటించారు”అని అన్నారు. హీరో విష్ణు మంచు మాట్లాడుతూ “కోన వెంకట్ వల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. అనూప్ ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు”అని తెలిపారు. చిత్ర దర్శకుడు ఈషాన్ సూర్య మాట్లాడుతూ “జిన్నాగా మంచు విష్ణు అదరగొట్టేశారు. గొప్ప కమిట్‌మెంట్ ఉన్న నటుడు మంచు విష్ణు కామెడీ టైమింగ్ అద్భుతం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్, జి.నాగేశ్వర్ రెడ్డి, ఛోటా కె.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Ginna Movie pre release in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News