Wednesday, January 22, 2025

గిరిజనుల కోసం గిరి వికాస పథకం

- Advertisement -
- Advertisement -

రేగొండః వలసలకు స్వస్తి పలికి రైతే రాజు అనే వాదాన్ని నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు గిరి వికాస్ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు సా గునీరు అందిస్తున్నట్లు భూపాలపల్లి నియోజకవర్గ ఎంఎల్‌ఏ గ ండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం రేగొండ మం డలంలోని రామన్నగూడెం తండా గ్రామ పంచాయతీలో లం బాడి రైతులకు గిరి వికాస పథకం క్రింద మంజూరయిన బో ర్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి స్వయంగా బోర్‌ను ఆ పరేట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులకు భూమి ఉండి సాగుకు బోరు అవసరమైన పేద రై తులకు గిరి వికాసం పథకం క్రింద బోరు బావి వేయించి, మో టారు, విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరు గుతు ందన్నారు. అలాగే ఈ పథకం ద్వారా 150 ఎకరాలక సాగు నీరు అందుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరివికాసం పథకం క్రింద స్థానిక గ్రామ పంచాయతీకి 17 బోరుబావులు మంజూరయినట్లు తె లిపారు. ప్రతి గిరిజన రైతు బిడ్డ ఈ గిరివికాస్ పథకాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.

గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకొని ఆరుశాతం ఉన్న రిజ ర్వేషన్ 10 శాతం వరకు పెంచుతున్న ఘనత మనదని, గిరిజన, లంబాడి సోదరులు రానున్న రోజుల్లో ప్రభుత్వానికి అండగా ఉండాలి వారు కోరారు. బోర్లను రైతులకు వర్షాలు రాకుముందే బోర్ బండ్లు తీసుకొని వచ్చి బోర్ వెయ్యాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సు రేందర్‌గౌడ్, ఎంపివో రాంప్రసాద్‌రావు, ఎంపిపి పున్నం లక్ష్మి రవి, జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి రైముద్దీన్, స్థానిక సర్పంచ్ బానోతు బిక్యా నాయక్, జూబ్లీనగర్ సర్పంచ్ జంగేటి నరేష్, ఎంపిటిసి శనిగరపు వెంకన్న, బిఆర్‌ఎస్ పార్టీ మండల అ ధ్యక్షుడు అంకం రాజేందర్, మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి దాట్ల రాజేందర్, రేగొండ పిఏసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, రేగొండ బిఆర్‌ఎస్ టైన్ అధ్యక్షుడు కొలేపాక బిక్షపతి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పొట్ల రవి సామ్రాట్, మండల ఎస్‌సి సెల్ అధ్యక్షుడు వారణాసి అజయ్, రైతు సంఘం నాయకులు లెంకల రమణారెడ్డి, ఎస్‌సి సెల్ రాష్ట్ర నాయకులు జెళ్ల ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News