Thursday, January 23, 2025

కెసిఆర్‌ను కలిసిన గమాంగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ బిజెపి నాయకుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత దేశ రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది. గిరిధర్ వెంట ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా ఉన్నారు. నుంచి గిరిధర్ గమాంగ్ బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సిఎం కెసిఆర్‌ను కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా క్రియాశీల నాయకుడిగా కొనసాగారు. ఒడిశాలోని కోరాపుట్ లోక్‌సభ సభ్యుడిగా మొదటిసారి 1972లో ఆయన గెలిచారు. అప్పటి నుంచి 2004 వరకు 9 సార్లు వరుసగా ఎంపీగా గెలుస్తూనే వచ్చారు. అయితే 1999 ఫిబ్రవరి నుంచి పది నెలల పాటు ఒడిశాకు 13వ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు.

అయితే 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి ఓటమిని చవి చూశారు. 2009 ఎన్నికలలో బిజూ జనతాదళ్‌కు చెందిన జయరామ్ పాంగి చేతిలో ఆయన మొదటిసారిగా కోరాపుట్ లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయారు. ఉండగా 1999 సంవత్సరం ఏప్రిల్ నెల 17వ తేదీన జరిగిన అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపిగా గిరిధర్ గమాంగ్ కూల్చారు. అప్పట్లో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ టైమ్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నాటి బిజెపి ప్రభుత్వాన్ని కూల్చారు. అయితే కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను పక్కన పెట్టడంతో చిన్నబుచ్చుకున్న ఆయన, కుమారుడు శిశిర్ గమాంగ్‌తో కలిసి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి బిజెపిలోనూ ఆ రాష్ట్రం నుంచి కీలక నేతలుగా కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News