Friday, April 4, 2025

విశాఖలో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి.. కూతురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

విశాఖపట్టణం జిల్లాల్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది కత్తితో తల్లి, కూతురిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. కూతురు తీవ్రంగా గాయపడింది. జిల్లాలోని కొమ్మాది స్వయంకృషి నగర్‌లో జరిగిన ఈ విషాద ఘటన..స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News