Sunday, April 13, 2025

విశాఖలో రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నంలో మరో ప్రేమోన్మాది చెలరేగిపోయాడు. మధురవాడలో ప్రేమోన్మాది దాడి ఘటన మరువక ముందే మరో ఘటనతో విశాఖ నగరం ఉలికిపాటుకు గురైంది. తాజా ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గాజువాకకు చెందిన యువకుడు అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన బాలికను ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలిసిపోవడంతో బాలికకు వేరే పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న సదరు యువకుడు బాలిక ఇంట్లోకి చొరబడి తల్లి,

కూతురుపై విచక్షణ రహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు. యువకుడి దాడి నుంచి కాపాడాలంటూ తల్లి కూతుర్లు ఇద్దరు కేకలు వేయడంతో అక్కడి నుంచి సదరు యువకుడు ఉడాయించాడు. స్థానికులు తల్లీకూతుళ్లను ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News