Wednesday, January 22, 2025

పరిగిలో బాలిక హత్య.. స్క్రూ డ్రైవర్ తో కళ్లు ఛిద్రం..

- Advertisement -
- Advertisement -

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. మృతురాలిని శిరీషగా గుర్తించారు. శిరీష రెండ్రోజులుగా కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు తెలిపారు. హత్య చేసిన అనంతరం దుండగులు మృతదేహాన్ని నీటి గుంతలో పడేశారు. శిరీష హత్యపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శిరీషను చంపి కళ్లను స్క్రూ డ్రైవర్ తో ఛిద్రం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News