Saturday, December 21, 2024

మహారాష్ట్రలో మరో దారుణం.. చెరకు తోటలో 10 ఏళ్ల బాలిక మృతదేహం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇంట్లో నుంచి వెళ్లి కనిపించకుండా పోయిన ఒక 10 సంవత్సరాల బాలిక మృతదేహం చెరకు తోటలో లభించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. బాలికపై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కర్వీర్ తాలూకాలోని షియే గ్రామంలో నివసిస్తున్న ఆ బాలిక తల్లిదండ్రులు షిరోలి ఎండిసి ప్రాంతంలోని ఒక పరిశ్రమలో పనిచేస్తున్నారు. బీహార్ నుంచి వలస వచ్చిన ఈ కుటుంబం షియే గ్రామంలో నివస్తింది. బుధవారం సాయంత్రం మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా వాడుతున్నందుకు సమీపం బంధువు ఒకరు మందలించడంతో ఆ బాలిక ఇంట్లో నుంచి అలిగి బయటకు వెళ్లిపోయింది.

ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ బాలిక తల్లిదంద్రులు గాలింపు చేపట్టి రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం తన ఇంటికి 800 మీటర్ల దూరంలోని ఒక చెరకు తోటలో ఆ బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. హత్య చేచడానికి ముందు ఆ బాలికపై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్టు మార్టం నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయని వారు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితులను వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News