Monday, January 20, 2025

బాలిక బాత్రూమ్‌లో ప్రసవించి… పసికందును కిటీకీలో నుంచి బయటపడేసింది….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: బాలిక పండంటి బిడ్డకు జన్మనిచ్చి అనంతరం బాత్రూమ్ కిటికీలో నుంచి పాపను బయట పడేసిన సంఘటన తూర్పు ఢిల్లీలోని కొండ్లీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జయ్ అంబీ ఆపార్ట్‌మెంట్‌లో పెళ్లి కాని బాలిక బాత్రూమ్‌లో ప్రసవించింది. పసికందును బాత్రూమ్ కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పసికందును ఆస్పత్రికి తరలించారు. బాలిక ఇంట్లో వెళ్లి చూడగా బాత్రూమ్, డస్ట్‌బిన్ రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే సదరు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు పెళ్లి కాకపోవడంతో పసికందును వదిలించుకోవాలని చూసిందని పోలీసులు తెలిపారు. గతంలో ఢిల్లీలో ఏడు నెలల క్రితం గర్భవతిని భర్త, మరదులు కలిసి తగలబెట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News