Sunday, December 22, 2024

పెళ్లి పేరుతో కిలేడీ ఘరానా మోసం…

- Advertisement -
- Advertisement -

girl cheating in the name of marriage in hyderabad

హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ కిలేడీ ఘరానా మోసానికి పాల్పడింది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న వృద్ధుడిని వివాహం చేసుకుంటానని బుట్టులోకి దించి రూ. 46 లక్షలు టోకరా వేసింది. బాధితుడి వయసు 50సంవత్సరాలు పైనే. పూర్తి వివరాల్లోకి వెళితే…. ఇటీవల రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న అతను తన వ్యక్తిగత వివరాలను ఓ మ్యాట్రిమోనీ సైట్ లో నమోదు చేశాడు. ఆ తెల్లారే ఆయనకు ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. అప్పటినుంచి చాటింగ్ చేసేవారు. తాను ఇంజినీరింగ్ చదువుతున్న అమ్మాయినని పరచయం పెంచుకున్న యువతి మీరు 50వ పడిలో ఉన్నా నేను మిమ్మల్నే పెండ్లి చేసుకుంటానని వృద్ధుడ్ని బుట్టలోకి దించింది. అప్పటినుంచి ఆమె కోరిన విధంగా సదురు వ్యక్తి డబ్బు పంపించాడు. ఆ విధంగా మొత్తం రూ.46 లక్షలు కాజేసింది. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News