Monday, December 23, 2024

గచ్చిబౌలిలో బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. గోపనపల్లి ఎన్టీఆర్ నగర్ లో తల్లిదండ్రుల తో పాటు రాణి (15) నివాసముంటుంది.  ఇంట్లో పని విషయంలో రాణిని తల్లి హీరా భాయ్ మందలించింది. ఆదివారం ఉదయం ఇంటి వద్ద నుంచి బాలిక అదృశ్యమైంది. సోమవారం ఉదయం సమీపంలోని కుంటలో రాణి శవమై తేలింది. మృతురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి నాను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  నాలుగు నెలల క్రితమే నాగర్ కర్నూల్ నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలస వచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News