- Advertisement -
ముంబై : అత్యాచార అవమానం తట్టుకోలేక ఓ బాలిక (17) శనివారం ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర లోని అమరావతి జిల్లా లోని ఓ గ్రామంలో బాలిక కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి (24) తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమం లోనే అతడు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. ఈ విషయం కుటుంబ సభ్యులతోపాటు అందరికీ తెలియడంతో అవమానం భరించ లేక ఆ బాలిక శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మైనర్పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని కేసు విచారిస్తున్నారు.
- Advertisement -