Thursday, January 23, 2025

పాఠశాలకు వెళ్లిన బాలిక శవమై తేలింది

- Advertisement -
- Advertisement -

అదృశ్యమైన బాలిక అనుమానాస్పదస్థితిలో
మృతి దమ్మాయిగూడ చెరువులో
మృతదేహం లభ్యం న్యాయం
చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన
బంధువులు పోలీసుల వైఫల్యంపై
మండిపాటు, రాళ్లదాడి సంఘటనా
స్థలాన్ని పరిశీలించిన డిసిపి, ఎసిపి

మనతెలంగాణ/జవహర్‌నగర్/సికింద్రాబాద్ / హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన గీడల ఇందు (10) అదృ శ్య సంఘటన చివరకు అనుమానాస్పద మృతి తో విషాదాంతంగా మారింది. గురువారం ఉదయం ఇందును తండ్రి నరేష్ దమ్మాయిగూడలోని పాఠశాల వద్ద వదిలిపెట్టి వెళ్లిపోగా బా లిక తన బ్యాగ్‌ను అక్కడే వదిలిపెట్టి పుస్తకాలు తెచ్చుకుంటానని వెళ్లి అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీంలను రప్పించి గాలింపు చేపట్టినా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు సిసి కెమెరాలు పరిశీలించగా బాలిక స్కూల్ నుంచి అడ్డదారిలో చెరువు కట్టమీదుగా  ఇంటికి వెళ్లినట్లుగా కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

పోలీసులు డాగ్‌స్కాడ్‌ను రప్పించి చూడగా చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో అదృశ్యమై 24 గంటలు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ దమ్మాయిగూడలో శుక్రవారం బాలిక కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ధర్నాకు దిగి పోలీసుల వైఫల్యంపై మండిపడ్డారు. కనిపించకుండాపోయిన గంటలోపే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. చెరువు వద్ద గంజాయి ముఠా, తాగుబోతులు ఎప్పుడు ఉంటారని, ఈ విషయంలో పోలీసులకు చెప్పినా సరిగా స్పందించలేదని మండిపడ్డారు. గంజాయి ముఠా తమ పాపను ఏమైనా చేసిందా అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందును వెతుకుతూ చెరువు వద్దకు వెళ్లినప్పుడు అక్కడ నలుగురు యువకులు ఉన్నారని బంధువులు ఆరోపించారు. తమకు వారిపై అనుమానం ఉందన్నారు.

తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మల్కాజిగిరి డిసిపి రక్షితామూర్తి, కుషాయిగూడ ఎసిపి సాధన రేష్మీపేరుమాళ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. అయినప్పటికీ ధర్నా కొనసాగించారు. మరో పక్క పోలీస్ బృందం అంబేద్కర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాలలో వెతకుతూ చూడగా చెరువులో బాలిక మృతదేహం కనబడటంతో క్రైం ఎస్‌ఐ రాంబాబు చెరువులోకి దిగి బాలిక మృతదేహం బయటకు తీశాడు. అప్పటికే చెరువు వద్దకు తల్లిదండ్రులతో పాటు స్థానికులు భారీ ఎత్తున గుమిగూడారు. భారీ ఎత్తున చెరువు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ వాహనానికి అడ్డుపడి బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించాలంటూ పోలీసులతో వాగ్వాదం చేయగా, భారీ బందోబస్తు మధ్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బాలిక శరీరంపై గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉదిృక్తత చోటు చేసుకుంది.

చిన్నారి బందువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా గోపాలపురం ఎసిపి సుధీర్ ఆధ్వర్యంలో చిలకలగూడ సిఐ నరేష్ పెద్ద సంఖ్యలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నారి బంధువులు, ప్రజా ప్రతినిధులను మార్చురీ పరిసరాల్లోకి అనుమతించకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల నిర్లక్షమే కారణమంటూ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆమెతో పాటు మహిళా కార్యకర్తలను ఆదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. చిన్నారి ఇందుకు సంబంధించిన పోస్టుమార్టుం వివరాలు చెప్పాలని వైద్యులను నిలదీయగా వివరాలు వెళ్లడించడానికి నిరాకరించిచారు. పూర్తి రిపోర్టు రావడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే చిన్నారి ఉపిరితిత్తుల్లో నీరు ఉన్నట్టు గుర్తించారని, శరీరంపై ఎటువంటి గాయాలు లేవని చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్టు వైద్యులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

చెరువులో చిన్నారి ప్రమాదావశాత్తు కాలు జారి పడిందా లేక ఎవరైనా తోసేశారా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వీడియో చిత్రీకరణ ద్వారా వైద్య బృందం పోస్టుమార్టుం నిర్వహించి నాలుగు పేజీల పంచనామాతో వివరాలు రికార్డు చేసినట్టు సమాచారం. చిన్నారి ఇందు బావ మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. కాగా సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి అంబేద్కర్‌నగర్‌కు మృతదేహాన్ని తీసుకరాగా కాంగ్రెస్, బిజెపి, బిఎస్‌పి నాయకులు పోలీస్ వాహనాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లదాడి చేశారు. మృతదేహాన్ని తీసుకునేది లేదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News