Sunday, February 23, 2025

బాలిక ప్రాణం తీసిన ఊయల

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ఊయల ఉరితాడై బాలిక ప్రాణం తీసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. సిరికొండ గ్రామంలో కొడప జంగు-లక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 13 ఏళ్ల కుమార్తె విజయలక్ష్మి ఉంది. ఆమె ఏడో తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఫ్యాన్‌కు చీరను ఊయలలాగా కట్టి తన స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటుంది. చీర బాలిక మెడకు బిగుసుకోవడంతో ఊపిరాడక ఆమె చనిపోయింది. స్నేహితులు గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో అప్పటికే బాలిక చనిపోయి కనిపించింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News