Wednesday, January 22, 2025

నోట్లో యాసిడ్ పోసి అత్యాచారయత్నం… బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మేనమామ బాలిక(14) నోట్లో యాసిడ్ పోసి అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వెంకటాచలం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రిటైర్డ్ టీచర్‌కు ఓ బాలిక జన్మించడంలో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. గత సంవత్సరం సెప్టెంబరు 5న తన తల్లిదండ్రులతో కలిసి ఓ వేడుకకు బాలిక హాజరైంది. బాలిక బంధువులో ఇంట్లో ఒంటరిగా ఉండడంతో దూరపు బంధువు మేనమాయ గుర్తించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి బాలికను పట్టుకోగా అతడి నుంచి తప్పించుకొని మరుగుదొడ్డిలోకి పారిపోయింది. మరుగుదొడ్డి తలుపులు పగలగొట్టి బాలిక నోట్లో యాసిడ్ పోశాడు. అనంతరం ఆమెపై అత్యాచారయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. చికిత్స పొందుతూ ఏడు నెలల తరువాత బాలిక చనిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News