Sunday, December 22, 2024

బాలిక ప్రాణం తీసిన ఎస్‌మార్ట్‌ మాల్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : ఐస్‌క్రీం కోసం మాల్‌కు వచ్చిన బాలిక ఫ్రిజ్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించడంతో కరెంట్ షాక్ తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవీపేటకు చెందిన గూడురు రాజశేఖర్ తన భార్య పిల్లలతో కలిసి నందిపేటకు అత్తారింటికి వచ్చారు. సోమవారం అత్తారింటి నుంచి తన సొంతూరుకు వెళ్తుండగా కూతురు రిషిత(4) ఐస్ క్రీం కావాలని మారం చేసింది. నందిపేటలోని ఎస్‌మార్ట్‌కు రిషిత తన తండ్రి తీసుకెళ్లాడు. తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులను పరిశీలిస్తుండగా మరో ఫ్రిజ్ వద్దకు రిషిత చేరుకొని డోర్ పట్టుకుంది. కరెంట్ షాక్‌తో బాలిక అక్కడే విలవిలలాడింది. వెంటనే తండ్రి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన చనిపోయిందని చెప్పడంతో తండ్రి కుప్పకూలిపోయాడు. దీంతో బాలిక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంటనే బాలిక మృతదేహంతో ఎస్‌మార్ట్ మాల్ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాహుల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News