Sunday, January 19, 2025

తల్లి టివి చూస్తుండగా… చిన్నారి ప్రాణం తీసిన వాటర్ హీటర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: వాటర్ హీటర్ చిన్నారి ప్రాణం తీసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకోండ మండలం పరిధిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… అభంగపట్నం గ్రామంలో నాగారాజు, మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె శివాణి(04) ఉంది. చలికాలం కావడంతో స్నానం చేయడానికి వేడి నీళ్ల కోసం బాత్రూమ్‌లో బకెట్‌లో హీటర్ పెట్టారు. తల్లి టివి చూస్తుండగా శివాణి ఆడుకుంటూ వెళ్లి బకెట్‌లో చేతి పెట్టింది. కరెంట్ షాక్‌తో పాప ఘటనా స్థలంలోనే చనిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News