- Advertisement -
సంగారెడ్డి: ప్రేమించిన మేనబావతో పెళ్లి రద్దు కావడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో జరిగింది. పోలీసులుత తెలిపిన వివరాల ప్రకారం…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావులపాలెముకు చెందిన బాలిక(14) తల్లిదండ్రులు చనిపోవడంతో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటుంది. ప్రస్తుతం బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలికను మేనబావకు ఇచ్చి పెళ్లి చెద్దామని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు. బావ-మరదలు ప్రేమించుకుంటున్నారు. మేనబావ మద్యానికి బానిస కావడంతో బాలిక సంరక్షకులు ఆమె పెళ్లిని రద్దు చేశారు. బాలిక మనస్తాపం చెంది 23న సాయంత్రం ఇంట్లో ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.
- Advertisement -