- Advertisement -
భువనగిరి యాదాద్రి: ఓ యువకుడు తన వాట్సాప్ స్టేటస్‌లో తన ఫోటో పెట్టాడని బాలిక(14) ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం బోయిన్పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాభావత్ శిల్ప అనే బాలిక పోతారం గ్రామంలో కూరగాయాల తోటలో కూలీగా పని చేస్తోంది. తోటలో తేజావత్ మధుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు స్నేహితులగా ఉండడంతో ఆమె ఫోటోను తన ఫోన్లో మధు భద్రపరుచుకున్నాడు. బాలిక ఫోటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. అతడి వాట్సాప్ స్టేటస్ లో బాలిక ఫోటోను చూసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. మధు వేధింపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
- Advertisement -