Saturday, December 21, 2024

వ్యాపారంలో నష్టాలు… కూతురు నోట్లో కుంకుమ పోయడంతో బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వ్యాపారంలో నష్టాలు రావడంతో కూతురును పూజగదిలో పడుకోబెట్టి పసుపు నీళ్లు చల్లి అనంతరం బాలిక నోట్లో కుంకుమ పోయడంతో బాలిక ఊపిరాడక చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వేణుగోపాల్ ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. పొక్లెయిన్ నిర్వహణలో నష్టం రావడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాడు. తన కుటుంబానికి చెడుపట్టుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపాడు. వేణు కూతురు పునర్విక పూజ గదిలో పడుకోబెట్టిన తరువాత పసుపు నీళ్లు చల్లాడు. నోటి నిండా కుంకుమ పోయడంతో ఊపిరాడక కేకలు వేసింది. చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు నుంచి చెన్నైకు తరలించారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News