Monday, January 20, 2025

వేడి నీటిలో పడి బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వేడి నీటిలో పడి బాలిక మృతి చెందిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం. ఎపి లోని ఆదోని మండలం హన్వాల్ గ్రామానికి చెందిన గొల్ల హరిప్రియ (06) ఈ నెల 22 న ఉదయం ప్రమాదవశాత్తు ఇంటి ముందు పోయ్యిపై ఉన్న వేడి నీటి గిన్నెపై పడింది.

ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం కర్నూలు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ చిన్నారి శుక్రవారం రాత్రి మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News