Sunday, December 22, 2024

గుండెపోటుతో బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:మద్దిరాల మండల కేంద్రానికి చెందిన పాక శ్రావ్య (15) 10వ తరగతి విద్యార్ధిని గుండె పోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే క స్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని మొహరం పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులకు తోడుగా పశువుల కాపరిగాఉదయం పది గంటల సమయంలో తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని వైద్యం కోసం హుటాహుటిన అస్పత్రికి బయలుదేరాగా మార్గమధ్యలో మృతి చె ందినట్లు తెలిపారు. పాక యాదగిరి దంపతులకు ముగ్గురు సంతానం కాగా చిన్న కూతురు శ్రావ్య గారాలపట్టి అకాల మరణం తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News