బతుకుదెరువు కోసం బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లా బేగంపూర్ గ్రామానికి చెందిన మేరాజ్, హసీనా దంపతులు వీరికి 3 సంవత్సరాల 6 నెలల కూతురు, 1 సంవత్సరం కుమారుడు ఉన్నాడు. వలస వచ్చి గౌతాపూర్ సమీపంలోని హజార్ పాలిష్ యూనిట్ మిషన్ లో 6 నెలల నుండి పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే ఉదయం ఏడు గంటలకు మేరాజ్ పనికి వెళ్ళాడు. ఇంట్లో వంట చేస్తున్న భార్య హ సీనా మహి(3 సంవత్సరాల 6. నెలల పాప) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పాలిష్ యూనిట్ మిషన్ లోని సంపులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో చూడగా కుమారుడు ఉన్నాడు కూతురు కనిపించలేదు. విషయాన్ని వెంటనే యూనిట్ మిషన్ లో పనిచేస్తున్న భర్త మేరాజ్ కు వివతెలిపింది.
చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో సంపులో చూడగా కనిపించింది. తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుండి మత శిశు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడున్న వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతి దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతదేహంతో కుటుంబీకులు పాలిష్ యూనిట్ మిషన్ వద్ద రోడ్డుపై కేటాయించి నిరసన తెలిపారు. మృతురాలి తండ్రి మేరాజ్ ప్రమాదవశాత్తు ఆడుకు ంటూ స్టాంపులో పడి నా కూతురు మరణించిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.