- Advertisement -
తిరుపతి: తిరుపతి పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాల హైస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని విష్ణుప్రియ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారం కారణంగా విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Girl dies after hanging herself in Tirupati
- Advertisement -