Wednesday, January 22, 2025

బాచుపల్లిలో స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాచుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెడ్డి లాబ్స్ వెళ్లే దారిలో బుధవారం ఉదయం స్కూటీపై ఓ వ్యక్తి తన కూతురుని పాఠశాలకు తీసుకువెళ్తుండగా.. రోడ్డు దాటే క్రమంలో అతివేగంతో వచ్చిన బాస్యం స్కూల్ బస్సు స్కూటీని ఢీ కొట్టింది. దీంతో కింద పడిన బాలిక మీద నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో బాలిక తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News