Monday, December 23, 2024

తేలు కాటుతో బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : మండలంలోని తీగారంకు చెందిన ముస్కు వైష్ణవి (13) అనే బాలిక తేలు కాటుతో మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. గ్రామస్థులు, స్థానిక ఏఎస్సై రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముస్కు కర్ణాకర్, స్వప్న దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శనివారం రాత్రి వర్షం కారణంగా గ్రామంలో విద్యుత్తు సరఫరా లేదు. దీంతో అప్పుడే కురిసిన వర్షం చల్లదనానికి కర్ణాకర్ ఇంట్లోకి తేలు వచ్చింది. అది గమనించిన కర్ణాకర్ భార్య స్వప్న తేలును చీపురుతో కొట్టి చంపిది. కానీ తేలు పూర్తిగా చావలేదు.

అది చూసేందుకై పరుగున వచ్చిన కర్ణాకర్ చిన్న కూతురు వైష్ణవి ఒక్క సారిగా తేలుపై అడుగేసింది. దీంతో ఆ బాలికను తేలు కాటు వేసింది. వెంటనే కుటంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్టేషన్ ఘన్‌పూర్ ఆస్పత్రి కి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజిఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. బాలిక మృతి తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News