Monday, December 23, 2024

కత్తితో బెదిరించి… బాలికను జుట్టు పట్టుకొని లాక్కెళ్లి…

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: పెళ్లికి నిరాకరించడంతో 16 ఏళ్ల బాలిక జుట్టు పట్టుకొని కత్తితో బెదిరించి ఒక కిలో మీటరు లాక్కెళ్లిన సంఘటన ఛతీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓంకార్ తివారి అలియాస్ మనోజ్ (47) కు సంబంధించిన షాపులో బాలిక పని చేస్తుంది. పలుమార్లు పెళ్లి చేసుకోవాలని బాలికపై ఓంకార్ ఒత్తిడి తేవడంతో ఆమె తల్లి అతడిని హెచ్చరించింది. తాజాగా ఓంకార్ బాలికను కత్తితో బెదిరించి జుట్టును ఒక చేతితో పట్టుకొని ఆమెను ఒక కిలో మీటరు లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక ఆడ పిల్ల నడి రోడ్డుపై అవమానం జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని కామెంట్లు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు స్థానికులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News