Monday, December 23, 2024

ప్రజ్ఞాసింగ్‌తో కేరళ స్టోరీ చూసిన బాలిక ముస్లిం యువకుడితో పరారీ

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: బిజెపి ఎంపి ఠాకూర్ ప్రజ్ఞాసింగ్‌కు గట్టి షాకే తగిలింది. తన పక్కన కూర్చోపెట్టుకుని ది కేరళ స్టోరీ సినిమా చూపించిన ఒక 19 ఏళ్ల యువతి తన ముస్లిం యువకుడి పరారు కావడం ప్రజ్ఞాసింగ్‌కు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.

ఒక ముస్లిం యువకుడి ప్రేమలో పడిన బాలికకు బిజెపి ఎంపి ప్రజ్ఞాసింగ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ యువకుడితో దూరంగా ఉండాలని హితవు చెప్పారు. అంతేగాక తన వెంటపెట్టుకుని మరీ ది కేరళ స్టోరీ సినిమాను ఆ బాలికకు చూపించారు. ఆ చిత్రంలో కేరళకు చెందిన ఒక హిందు మహిళను ఎలా బ్రెయిన్‌వాష్ చేసి ఇస్లాంలోకి మతమార్పిడి చేయించి సిరియాకు తీసుకువెళ్లి బలవంతంగా ఐఎస్‌ఐఎస్‌లోకి ఎలా చేర్చించారన్నది చూపించారు.

అయితే ఆ బాలికకు నచ్చచెప్పేందుకు బిజెపి ఎంపి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సినిమా చూసిన కొద్ది రోజులకే ఆ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయి యూసుఫ్ అనే ముస్లిం యువకుడిని మే 30న వివాహం చేసుకుంది. తన పెళ్లి కోసం కుటుంబ పెద్దలు కొన్న నగలను కూడా ఆ బాలిక తన వెంట తీసుకెళ్లిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెప్పినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.

యూసుఫ్ అనే యువకుడు తన తీపి మాటలతో తన కుమార్తెను వలలో వేసుకుని ఆమెను తీసుకుని పరారయ్యాడని ఆ బాలిక తండ్రి భోపాల్‌లోని కమలానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె పేరటి బ్యాంకు లోన్ తీసుకున్న యూసుఫ్ ఆమె చేబితే ఇఎంఐలు కట్టించాడని కూడా ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే బాలిక మాత్రం తన కుటుంబ సభ్యుల ఆరోపణలను పోలీసు స్టేషన్‌లో ఖండించింది. తనంతట తానుగా యూసుఫ్‌తో వెళ్లిపోయినట్లు పోలీసుల సమక్షంలో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News