Wednesday, January 22, 2025

హన్మకొండ జిల్లాలో డెంగ్యూతో బాలిక మృతి..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లాలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఓ బాలిక మృతి చెందింది. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ప్రవళిక(11)కు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది.

హన్మకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు డెంగ్యూ అని నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బాలిక కుటుంబంలో విషాదం నెలకొంది.కాగా మృతురాలి తమ్ముడు కూడా జ్వరంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News