Monday, March 10, 2025

విషాదంగా బోరుబావి ఘటన.. 10 రోజులు శ్రమించి బయటకు తీసిన చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ బోరుబావి ఘటన విషాదాంతమైంది. కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి చేతన మరణించింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు 10 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి బుధవారం రాత్రి బోరుబావి నుంచి బయటకు తీశారు.

చిన్నారిలో ఎలాంటి కదలికలు లేకుండా స్పృహ కోల్పోయి ఉండటంతో వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, చిన్నారి అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. దీంతో ఇన్ని రోజులు కష్టపడినా.. ఫలితం లేకుండా పోయింది. చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News