Monday, December 23, 2024

సెల్‌ఫోన్ పేలి 8ఏళ్ల బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలో సెల్‌ఫోన్ చేతిలో పేలిపోవడంతో 8ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. త్రిసూర్ జిల్లాలోని ఆదిత్యశ్రీ అనే బాలిక ఫోన్‌లో వీడియోను చూస్తోండగా పేలిపోయింది. సోమవారం రాత్రి 10.30 సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ బాలిక తల దగ్గర పేలడంతో మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: విరాట్-అనుష్క క్యూట్ డ్యాన్స్(వైరల్ వీడియో)

బాధిత బాలికి క్రీస్తు న్యూ లైఫ్ స్కూలులో 3వ తరగతి చదువుతుందని, బాలిక వీడియో చూసిన సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ మూడేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పజయన్నూర్ పోలీసులు తెలిపారు. కాగా పజయన్నూర్ పంచాయతీ బోర్డు మాజీ సభ్యుడు సౌమ్య దంపతుల కుమార్తె ఆదిత్యశ్రీగా పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News