Wednesday, January 22, 2025

విషాదం.. సోదరులకు రాఖీ కట్టి చనిపోయింది

- Advertisement -
- Advertisement -

ఓ యువతి తన సోదరులకు రాఖీ కట్టి ప్రాణాలు విడిచింది.. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న 17ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, పరిస్థితి విషమించడంతో తాను రక్షాబంధన్ వరకు బతికి ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టిన యువతి.. గంటల్లోనే తుదిశ్వాస విడిచింది. దీంతో సోదరులు కన్నీరుమున్నీరయ్యారు. వారి కుటుంబంతోపాటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News