Sunday, December 22, 2024

ప్రియురాలిని ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టిన ప్రియుడు..!

- Advertisement -
- Advertisement -

ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి పొలంలో పాతిపెట్టాడు. ఈ దారుణ సంఘటన భద్రాద్రి జిల్లాలోని మాచినేనిపేట తండాలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తన కూతురు కనిపించడం లేదని యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. యువతిని ఆమెను ప్రేమిస్తున్న యువకుడే హత్య చేసినట్లు గుర్తించారు.

స్వాతి, ఆమె ప్రియుడు వీరభద్రం..సింగరేణిలో ఉద్యోగం కోసం ఓ కుటుంబం వద్ద రూ.16లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే అప్పు తీర్చే విషయంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వడ్డీలు పెరుగుతుండడంతో అప్పు తీర్చాలని స్వాతి, వీరభద్రంను నిలదీసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న వీరభద్రం.. ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. స్వాతిని చంపి ముక్కలు చేసి గోనె సంచిలో మూట కట్టి పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులు విచారణలో తేలింది. దీంతో యువతి  మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News