Saturday, December 21, 2024

పెళ్లికి ప్రియుడి కుటుంబం అంగీకరించలేదని ప్రియురాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్యాయి మండలంలో యువతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి ప్రియుడి కుటుంబం అంగీకరించలేదని బాధితురాలు ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతురాలిని అష్మిత(18)గా గుర్తించారు. ఇందాల్వాయికి చెందిన సమీర్(22)ను అష్మిత ప్రేమించింది. యువతి కుటుంబసభ్యులు యువకుడి తల్లిదండ్రులతో సంప్రదింపులు చేయగా వారు అంగీకరించలేదు. విషయం ఇంట్లో తెలియడంతో పురుగుల మందు తాగిన అష్మిత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అష్మిత మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చేస్తున్నారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News