Thursday, January 23, 2025

ప్రేమించిన వ్యక్తి దక్కలేదని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రాజపేట: ప్రేమించిన వ్యక్తి దక్కలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన  రాజపేట మండలం పాముకుంట గ్రామంలోో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  20 సంవత్సరాల యువతి కాకల్ల మౌనిక తాను ప్రేమించిన వ్యక్తి దక్కలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలు తల్లి చంద్రమ్మ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఈనెల 1 న ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోయిన మౌనిక 3 న సోమిరెడ్డి వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తాను ప్రేమించిన వ్యక్తికి ఇతర అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని. మనస్థాపానికి గురై తన కూతురు మౌనిక ఆత్మహత్యకు పాల్పడిందని చంద్రమ్మ తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News