Monday, January 20, 2025

కిడ్నాప్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : జగిత్యాల రూరల్ మండలం దరూర్‌లో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ  పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక పని మీద  ఇంటి నుంచి బయటకి రావడంతో గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళారు. బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు భయాందోళనకు గురై ఇంటి చుట్టు పక్కల వెతకారు. కిడ్నాప్ అయిన బాలిక కారులో ఉన్న దుండగులు ఫోన్ లో మాట్లాడుతూ బిజిగా ఉండడం గమనించి చాకచక్యంతో కారులో నుంచి దూకి బయటపడింది. అక్కడ ఉన్న స్థానికుల వద్ద నుంచి ఫోన్ తీసుకొని తండ్రికి ఫోన్ చేయడంతో బాలికను ఇంటికి తీసుకెళ్ళారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలికను ఎందుకు ఎత్తుకెళ్ళారు అన్నదాని పై విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News