Wednesday, January 22, 2025

పదో తరగతి బాలికను చంపి చెరువులో పడేశారు….

- Advertisement -
- Advertisement -

పాట్నా: పదో తరగతి విద్యార్థిని మృతదేహం చెరువులో కనిపించిన సంఘటన బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగింది. గ్రామంలో పలు వాహనాలను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బ్రహ్మపూర్ గ్రామంలో సోమవారం స్కూల్ వెళ్లి న విద్యార్థిని సలోని కుమారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు వెతికారు. రెండు రోజుల తరువాత చెరువులో విద్యార్థిని మృతదేహం కనిపించింది. బాలిక బంధువులు , కుటుంబ సభ్యులు గ్రామంలో పలు వాహనాలను తగలబెట్టారు.

Also Read: మిస్డ్ కాల్‌తో పరిచయానికి ఇద్దరు బలి

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు తోటి విద్యార్థులు హత్య చేసి ఉంటారని ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. బాలిక ముఖంపై కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని పోలీస్ స్టేషన్ అధికారి నవీన్ కుమార్ తెలిపాడు. బాలికను చంపి చెరువులో పడేసి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వస్తే కానీ అసలు నిజాలు బయటకు రావు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News