Sunday, December 22, 2024

బైక్‌పై వచ్చి ప్రియుడ్ని గన్‌తో కాల్చి చంపిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ప్రియురాలు బైక్‌పై వచ్చి ప్రియుడిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఝార్ఖండ్‌లోని జమషెడ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పారూల్ ఖతూన్ అనే మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. జత్రాపూర్‌లోని చక్డహస్‌లో తన తండ్రితో కలిసి పారూల్ ఉంటుంది. అఖ్లక్యూ అనే వ్యక్తితో పారూల్ గత నాలుగు సంవత్సరాల నుంచి అక్రమసంబంధం కొనసాగిస్తుంది. వివాహేతర సంబంధ కొనసాగించలేనని అఖ్లక్యూ పలుమార్లు పారూల్ చెప్పిన కూడా అతడు పట్టించుకోలేదు. మదన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని లోకల్ క్లబ్ హౌస్ దగ్గర ఆమె బైక్‌పై వచ్చి అతడిని కలిసింది. ఇప్పటి నుంచి వివాహేతర సంబంధానికి ముగింపు పలుకుదామని ఆమె చెప్పడంతో అతడు నిరాకరించాడు.

వెంటనే గన్ తీసుకొని అతడిని కాల్చింది. అక్కడి నుంచి ఆమె పారిపోయింది, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని రక్తపు మడుగులో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫోన్‌కాల్స్ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఆమె బైక్ డ్రైవింగ్ ఎలా చేసిందని అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు ఆమెకు గన్ ఎలా వచ్చిందనే దానిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆమె డ్రగ్స్‌కు బానిసగా మారిందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News