Friday, December 27, 2024

గచ్చిబౌలిలో యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

యువతి అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సుదర్శన్ నగర్ కు చెందిన సాయి శ్రావణి (19) మసీద్ బండలోని లాన్సుమ్ అపార్ట్‌మెంట్ లో హౌస్ కీపింగ్ గా పని చేస్తుంది. రోజు మాదిరిగా జులై 30 వ తేది పనికి వెళ్లిన ఆమే తిరగి ఇంటికి రాలేదు. ఆమె పని చేసే అపార్ట్‌మెంట్ వద్ధకు వెళ్లి కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆ రోజు ఆమె డ్యూటికి రాలేదని సిబ్బంది చెప్పారు. గుల్‌మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద తెలిసిన వ్యక్తి సాయి శ్రావణి ని చూశాడని చెప్పడంతో తండ్రి శ్రీనివాస్ చుట్టపక్కల ఎంత వెతికిన యువతి ఆచూకీ లభించలేదు. దాంతో యువతి తండ్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News