Tuesday, December 24, 2024

స్కూటీపై వెళ్తున్న యువతిపై కత్తులతో దాడి…

- Advertisement -
- Advertisement -

Girl goes on a scooty was attacked with knives

అమరావతి: కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో యువతి చనిపోయింది. కాండ్రేగుల కూరాడ గ్రామానికి చెందిన దేవకిని సూర్యనారాయణ ప్రేమ పేరుతో వేధించాడు. ప్రేమించాలని వెంటపడడంతో యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై సూర్యనారాయణ పగ పెంచుకున్నాడు. యువతి స్కూటీపై వెళ్తుండగా వెంబడించి కత్తితో ఆమెపై ప్రేమోన్మాది దాడి చేశాడు. యువతి నడి రోడ్డుపైనే కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన యువతిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది.

Man knife attack on woman in Kakinada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News