Wednesday, January 22, 2025

బాలికను వేధించిన తండ్రికి ఐదేళ్ల జైలు తీర్పు చెప్పిన కోర్టు

- Advertisement -
- Advertisement -

టిబ్యూరోః కన్న కూతురిని లైంగికంగా వేధించిన తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ మాల్కాజ్‌గిరి కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…మాల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కుటుంబం నివసిస్తోంది. తల్లి సర్వెంట్‌గా పనిచేస్తుండగా, తండ్రి నర్సింహా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 06, 2020లో తల్లి పనికి వెళ్లగా బాలిక ఇంట్లోనే ఉంది. బాలిక చెల్లి, తమ్ముడిని తండ్రి బయటికి పంపించాడు.

తర్వాత బాలికను ఇంట్లోకి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక తప్పించుకుని బయటికి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక విషయం తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి మాల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ వేశారు. సాక్షాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితులకు శిక్షపడేలా చేసిన పోలీసులను రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News