Monday, January 20, 2025

పెళ్లికి నిరాకరించిందని..బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వివాహం చేసుకునేందుకు నిరాకరించిన బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎస్‌ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన బాలిక(17)ఈ నెల 1వ తేదీన కల్యాణ్‌నగర్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ బంధువుల అబ్బాయి సతీష్(27)ను వివాహం చేసుకోవాలని బంధువులు సూచించారు, దానిని బాలిక నిరాకరించింది. దీంతో బాలికపై కోపం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను ఇంట్లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే బాలిక మూసాపేటలో ఉండే బాలిక అమ్మమ్మ అనారోగ్యం బారినపడడంతో చూసేందుకు వెళ్లింది. బాలిక ముబావంగా ఉండడంతో బాలిక అమ్మమ్మ ఆరాతీసింది. దీంతో బాలిక తనపై సతీష్ చేస్తున్న అఘాయిత్యాన్ని చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News