చెన్నై: శ్మశానంలో ఖననం చేసిన బాలిక మృతదేహం నుంచి తలను వేరు చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా మధురాంతకం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్తరవాడి గ్రామంలో పాండియన్ కుటుంబం నివసిస్తోంది. పాండియన్ కూతురు కృతిక(12) ఆరో తరగతి చదువుతోంది. అక్టోబర్ 5న కృతిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అమ్మమ్మ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా విద్యుత్ స్తంభం విరిగి బాలికపై పడింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బాలిక చనిపోయింది. దీంతో శ్మశాన వాటికిలో బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ నెల 25న అమావాస్య కావడంతో బాలిక మృతదేహం నుంచి తలను వేరు చేయడంతో పాటు అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్ర పూజల కోసం బాలిక తలను వేరు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
శ్మశానంలో బాలిక తలను వేరు చేసి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -