Wednesday, January 22, 2025

అడవి పంది దాడిలో బాలికకు గాయాలు

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్: మండలంలోని డోండర్ గావ్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం స్వప్న అనే బాలిక పై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం .. బాలిక తన తల్లితో కలిసి నేరెడిగొండ తాండ గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ భూమిలో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లిందన్నారు. పత్తి విత్తనాలు పెట్టిన అనంతరం సాయంత్రం తన తల్లితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా డోంగర్ గావ్ గ్రామ శివారులో దారి పక్కన గల రాళ్ల కట్టల వెనుక నుండి అడవిపంది ఆకస్మాత్తుగా బాలిక పై దాడి చేయడంతో దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో బాలిక చేతికి తీవ్ర గాయాలయ్యాయి.న దాడి నుండి తప్పించుకున్న బాలిక తన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం వైద్య సిబ్బంది సిఫారస్ మేరకు ఆదిలాబాద్ రిమ్స్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. అడవి పంది దాడి చేసిన విసయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు బాలిక తండ్రి రాము తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News