Monday, December 23, 2024

తండ్రిని కొట్టి యువతి కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండంలం మూడపల్లి గ్రామంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. శాలిని అనే యువతి తండ్రి చంద్రయ్యతో కలిసి గుడికి వెళ్లి పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు కారులో వచ్చి తండ్రిని కొట్టి యువతిని తీసుకెళ్లారు.అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్ని రోజుల క్రితం యువతిని వేదించాడని,  అతడే కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. యువతిని కిడ్నాప్ చేసిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News